ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర
మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర
- యేసుని రక్తము పాపములనుండి విడిపించెను -2
వేయినోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును -2
॥ ఆనంద ॥
- రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా -2
మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా -2
॥ ఆనంద ॥
- ఆనందం ఆనందం యేసునిచూచే క్షణం ఆసన్నం -2
ఆత్మానందా భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం -2
॥ ఆనంద ॥